Tuesday, January 18, 2022

సమాంతరాలు

 కథ చదివినప్పుడు ఆనంద పడడం, ఉత్సాహ పడడం , ఏక్జ్ యిట్ అవడం అనేది చాలా తక్కువ సార్లు అవుతుంది . తల్లావఝుల పతంజలి శాస్త్రి గారి కొత్త కథల పుస్తకం 'సమాంతరాలు ' అలా ఫీల్ అయ్యాను . 

ఇప్పటి దాకా చదివింది రెండు కథలు - సమాంతరాలు , మార్కండేయులు కాఫీ . సమాంతరాలు మనిషి లోని స్వభావం , మానసిక పరిస్థితి ఎంత స్పష్టంగా చిత్రీకరించారు . 

మొదటి కథ సమాంతరాలు . ఒక రిటైర్డ్ ఉద్యోగి ఒంటరి జీవితం లోకి దొంగ ప్రవేశించాడు . వాడు కన్న కొడుకు కంటే ఎక్కువ అవుతాడు . కొడుకుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి చని పోదామని నిర్ణయించు కుంటాడు . దానికి ఈ దొంగ సాయం అడుగుతాడు . కొడుకులలో లేని మానవత్వం ఈ దొంగలో ఉంటుంది . ఆయనని చంపడానికి ఒప్పుకోడు . 

అల్లా అని అతనికి డబ్బు   అవసరం లేక  కాదు . ఆ అవసరం కోసం ఆయన సంతకం ఫోర్జ్ చేసి బాంక్ నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆ అవసరం లేకుండానే ఆయన చని పోతూ అతనకి డబ్బులిస్తాడు . 

ఇందులో ఎవరు తన వారు, ఎవరు పరాయి వారు తెలియని మానవ సంబంధాలు గురించి మన ముందు ఉంచారు . 

ఇక రెండో కథ రెండు వాక్యాలు మన మూడు ఎప్పుడూ కదులుతాయి . 'మార్కండేయులు తను ఎలా ఉండాలనుకున్నాడో  అలా ఉన్నాడు  . పూర్ణ  తాను ఎలా ఉండకూడదు  అనుకుందో అలా ఉంది '. 

మార్కండే యులు లా జనాపకాలలో జీవిస్తారా/ అంటే జీవిస్తారు . వారికి వర్తమానం త సంబంధ లేదు . ఎప్పుడు గతం లో ఉంటారు . అలా ఉండే మార్కండేయులు , వర్తమానం లో ఉండే పూర్ణ కి కుదరదు . కాని మార్కండేయులు పూర్ణ ని ప్రేమస్తాడు ఒక అ జనాపకం లా . దాన్ని వదలలేడు. పూర్ణ అతనిని పూర్తిగా మర్చి పోయి జీవితం కోన సాగించలేదు. 

రెండు కథలు మనల్ని అంత   తొందరగా వదలవు. నాలుగు పా మన మధ్యలో ఉంటారు . రాచాయి అన్నతళు జీవితం లో బుద్ధి ప్రమేయం ఉండదు . ఇది ఒక సాలె గూడు లా అల్లుకుంటూ పోతుంది. తరువాత దారం ఎటునుంచి ఎటు పోతుందో మనం ముందు ఊహిస్తే అది జీవితమే కాదు . పతంజలి శాస్త్రి గారికి నమస్కారాలు.