Monday, August 19, 2024

Margin Lands-2

 Second Part :

మొన్ననే భాగిరథి , అలకనంద కలిసి గంగ గా మారిన ప్రదేశం చూసాము . నిజంగానే గంగ ఒక నది మాత్రమే కాదు . ప్రకృతి యొక్క శక్తి .
ఆరతి కుమార్ తన రెండవ యాత్ర గా గంగ హూగ్లి దగ్గర ఎలా వుందో చూడాడానికి వెళ్ళారు .అందులో వరద లో వెళితే అక్కడ పరిస్థితి తెలుస్తుందని వెళితే -- మానవుడు ఎంతో తెలివిగా ఆ శక్తిని కట్టేసానని అనుకున్నది ఎంత అబద్ధమో తెలియజేస్తుంది ఆ ప్రదేశం .
ఫరక్కా బ్రిడ్జి . హేమచంద్ర ఎప్పుడూ చెపుతూ వుండేవారు . ఆ బ్రిడ్జి వస్తే అన్ని కష్టాలు తీరుతాయని భ్రమించారు . కాని గంగా ప్రవాహం లో వచ్చే 'సిల్ట్ ' ఆ బారేజికే ప్రమాదం . సముద్రం నీరు వెనక్కి రాకుండా చేసిన ప్రయత్నంతో బారేజి దగ్గర సిల్ట్ పెరిగింది . గంగ ఆ అడ్డం కి విసిగి తన రూటు మార్చుకుంది . ఇంకా గట్టిగా వరద వస్తే ఆ బారేజికే ప్రమాదం . ఆ రూటు మారడం వల్ల ఎన్నో ఊళ్ళు వరద కి దెబ్బ తిన్నాయి . అందులో కొంత భాగం ఝార్కండ్ . అయితే అక్కడ ఉండేవారు బెంగాల్ స్టేట్ . చివరికి వారు ఇక్కడ , అక్కడ లేరు . అక్కడికి స్కూల్ లేదు , కరెంట్ లేదు , హాస్పిటల్ లేదు . boundary నిర్ణయించేటప్పుడు గంగ ఒడ్డు అని రాసుకున్నారుట . ఇప్పుడు ఆ గంగ ఒడ్డు మారింది .
మనుష్యుల జీవితాలు ,ప్రకృతి తో అనుబంధాలు చూస్తే -- ఎందుకింత సంకుచితంగా ఆలోచిస్తామని అనుమానం వస్తుంది .

'Margin Lands' - A review

 మరో మంచి పుస్తకం .

మన చుట్టూ వున్న ప్రకృతి నుండి మనం ఎంత దూరంగా జరుగుతున్నమో చూపించే ఒక అద్దం . ప్రభుత్వం , అధికారులు కొంత స్వలాభం , కొంత అజ్ఞానం , కొంత అహం తో నడుస్తున్న జీవితాల్ని మరింత కిందకు తోసేస్తున్న వైనం చెపుతుంది ఈ పుస్తకం.
ఇది కూడా ఒక నాలుగైదు పోస్టులుగా చెప్తాను . అలవాటేగా !
ముందు ఆరతి కుమార్ సుఖవంతమైన వుద్యోగం వదులుకుని పరిసరాలను అధ్యయనం కోసం బయలుదేరుతారు . ముందుగా వెళ్ళింది థార్ ఎడారి .
ఎడారి అనగానే మనకు నీళ్ళు వుండవు , పేదరికం గుర్తుకు వస్తాయి . అదంతా నీళ్ళు వచ్చేలా చేసి పంటలు పండిస్తే -- ఒక అధికారి ఊహ ! లేదా ఒక మంత్రి గారి కల . అహా , ఒహో అనుకుంటాము ..
కాని అటువంటి పరిస్థితులలో ఎందుకు జీవిస్తారు ప్రజలు ? మంచి చోటుకు రావచ్చు కదా అని అనిపిస్తుది. అదే అజ్ఞానం . ఆ ఇసుకులో నీరు ఎక్కడ వుందో. అతి తక్కువ వర్షం పడుతుంది అక్కడ . ఆ కాసిని నీరు ఎలా కాపాడుకోవాలో, ఎలా పంటలు పండించుకోవాలో , ఏ మబ్బు వర్షంలా కురుస్తుందో, ఏది మురిపించి పోతుందో అన్నీ తెలుసు అక్కడ పుట్టి పెరిగిన చత్తర్ సింఘ్ కి . ప్రకృతిని ప్రేమిస్తూ , లాలిస్తూ , దానితో మమేకమవుతూ జీవించారు . వారు ప్రతి మబ్బుకి ఒక పేరు , ప్రతి గాలి తెమ్మెరకి ఒక ఉనికి .
' నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి వెడతారు . ఆ చదువు వస్తుందేమో తెలీదు కాని తన పుట్టి పెరిగిన ఈ ప్రదేశం గురించి తెలీదు ' అంటారు . కష్ట పడి జీవించి , బ్రతకడం వారి జీవిన విధానం . వారు అందులో ఆనందం .
ఎడారి పచ్చగా మార్చాలి అని డాం కట్టి కాలువ తవ్వారు . చివరి దాకా నీరు ఎక్కువ రాదు . దానితో మురికి, దోమలు - మలేరియా , డెంగు . అంతకు ముందు తెలియనవి వచ్చాయి. పై నుంచి వచ్చే వ్యర్ధాలతో నీరు కలుషితం , తాగితే రోగాలు . చివరికి వారి పాత పద్ధతే .
ఆ పద్ధతిలో నీరు. వుండాలంటే మధ్యలో అడ్డాలు వుండకూడదు . కాని సౌకర్యం కోసం మద్యలో ఎత్తుగా , అడ్డంగా రోడ్డు . Air energy అంటూ మంచి దట్టమైన ఓరన్ (' వారికి అది పవిత్ర స్థలం . ఒక్క చెట్టు ముట్టుకోరు ) మధ్యలో windmills . వాటికి తగిలి పక్షులు చచ్చిపోవడం . పచ్చదనం కోసం తొందరగా పెరిగే Exotic Israeli Acacia చెట్లు . అవి భూగర్భంలో వున్న నీరు అంతా లాగేస్తాయి . ఎడారి ఇసుక మరింత ముందుకు వస్తోంది .
ఇదంతా మన నాగరీకుల నిర్వాకం . అసహాయంగా చూడడం చత్తర్ సింగ్ లాంటి వారికి మిగిలింది . ఒక ఏడాది ఆ ప్రాంతం తిరిగి రాసిన 30 పేజిల మొదటి భాగం .
May be an image of map and text
All reac

Sunday, July 14, 2024

Yatra Special-13

 యాత్రా స్పెషల్ - ఆఖరిది .

ఈ కథ పూర్తి చేసే ముందు మర్చిపోయిన కొన్ని విశేషాలు .
బదరీ బౌధ్ధ కేంద్రం . ఆ కట్టడం చూస్తే అర్థం అయ్యిపోతుంది . శంకరాచార్యులు వారు వారిని వాదం లో ఓడించి ఆ కేంద్రం బదరీ దేవాలయం గా మార్చారుట . లోపల విగ్రహం కాదు . స్వామి వారి కి అక్కడ దొరికిన సాలిగ్రామం . దానికి ఒక వైపు కుబేరుడు , గరుడుడు , ఉత్సవ విగ్రహం ఉద్ధవ్ , ఆ పక్కన నారదుడు , రెండొ వైపు నరుడు , నారయణుడు . బయట రెండు కొండలు కూడా నరుడు నారాయణుడు - తపస్సులో ఉన్నట్లు . కొండలకు పేర్లేమిటి ? మనుషులకు మాత్రం ఎందుకు ? A kind of owning up..
ఇక నేను నేర్చుకున్నది -- యాత్రలలో సహనం వుండాలి . అందులో అంత మంది వున్నప్పుడు అవతల వారిని అర్ధం చేసుకుంటూ పోవాలి .
౨. దొరికిన దానిలో నచ్చింది తినేయాలి . మితం గా తింటే మంచిది
3. ఇక్కడ నేను ఏమి చూసాను , నేర్చుకున్నాను -- అంటే ఇంకా process జరుగుతోంది . ఒకటి మాత్రం అర్థం అయ్యింది . అక్కడ గుడి కాదు ముఖ్యం ప్రయాణం ముఖ్యం .
4. దానితో పాటు పర్యావరణ స్పృహ ఉండాలి .
5. ఇబ్బందులు ఉంటాయి . నీ శక్తి నువ్వే గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి . ఎక్కువ వద్దు , తక్కువా వద్దు .
ప్రతి విషయం లో మంచి , చెడు రెండూ ఉంటాయి ఏది ఎక్కువ ఆలోచిస్తావనేది నీ మీద ఆధారపడి ఉంటుంది
6. యాత్ర విడవిడిగా చేస్తే ఖర్చు ఎక్కుువైనా నిదానంగా అన్నీ చూడచ్చు
🙏🙏స్వస్థి
All reactions:
Guru Ram Prasad Peddada, Venkob R Balantrapu and 63 others

Yatra Special-12

 యాత్ర స్పెషల్ - 12

ఇక యాత్ర చివరికి వచ్చేసాము. కిందకి దిగుతున్న కొద్ది మళ్ళీ నా ఆరోగ్యం వచ్చేసింది . మాములుగా నడుస్తున్నాను. చలి తగ్గింది. Monal లో మళ్ళీ a.c. వేసుకున్నాము. పొద్దున మాములుగా లేచాము .
బయలుదేరి హరిద్వార్ కి ప్రయాణం.
దారిలో చూసిందింతా కొండల విధ్వంసం . కరెంటు కోసమో , డామ్ల కోసమో , సిమెంటు కొసమో కొండలు తొలిచేస్తున్నారు. దుమ్ము , ధూళి. గంగ నిండా slush. ఆ దుమ్ముకి నాకు కూడా తుమ్ములు . మందు రెడీగా పెట్టుకున్నాము కనుక ఎక్కువ ఇబ్బంది పడలేదు. నాకెందుకో డైనమైట్ తో ఆటలాడుకుంటున్నామని అనిపించింది .
దారిలో ఋషికేశ్ లో ఆగాం. స్వామి శివానందగారి ఆశ్రమం , లక్ష్మణ ఝూలా చూడాలని. శివానంద ఆశ్రమం ఇప్పటిదా?! ఆయన పుస్తకాలు చదివి చదువు మధ్యలో వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిన వారిలో నండూరి రామ్మోహనరావు గారు ఒకరు. ఇంట్లో వాళ్ళు పరుగున స్వామిజీ దగ్గరకు వెళ్ళి సంగతి చెపితే ఆయన మందలించి వెనుకకు పంపిచారుట.అప్పటికే ఆయనకు పెళ్ళయింది. ఆ తరువాత ఆయన పెండ్యూలం రెండో వైపు వెళ్ళింది . సైన్స్, నాస్తికత్వం ఆయనను ఆకట్టుకున్నాయి. చివరి దాకా అదే పంథాలో ఉండిపోయారు .
ఎప్పటి నుంచో ఈ ఆశ్రమం చూడాలని. ప్రశాంతంగా వుంది. అక్కడ ఓ రెండు పుస్తకాలు కొని ఆయన సమాధి చూసాము. అక్కడ నుంచి దిగితే లక్ష్మణ ఝూల. ఎన్ని మెట్లు అని అడిగితే వంద అన్నారు. దిగుతా కాని మళ్ళీ పైకి రాలేను. అక్కడే వదిలేసే లెక్కనయితే ఓ కే అంటే స్వామిజీ ' ఇక్కడే వుండు లే' అన్నాడు. ఆ ఆశ్రమం పరిసరాలు గమనించుకుంటూ అక్కడే వున్నాము. మా చెల్లెలు కూడా వెళ్ళలేదు. అసలుది అయిపోయాయి , ఈ కొసర్ల ఏముంది ?!
రిషికేశ్ లో bungy jumping - highest in India - అని వుంది . rafting బాగా encourage చేస్తున్నారు . ఓ పది రాఫ్ట్ పడవలు చూసాం . వయసులోనే ఈ సరదాలూ, adventure లు . అప్పుడు చెయ్యక పోతే ఇక అంతే . మనిషి లోని అంతర్గత శక్తికి ఇవి పరీక్షలు .
దారిలో భోజనం చేసి సాయంకాలానికి హరిద్వార్ చేరాము . ఇక రేపు పొద్దున్నే డిల్లి . ఆ మర్నాడు విజయవాడ .
ప్రయాణం చివరి దశకు చేరింది . ఈ ప్రయాణం లో నేను నేర్చుకున్నది తో ఈ పరంపర ముగిస్తాను .
All reactions:
Venkob R Balantrapu, Rompicharla Bhargavi and 36 others