అమెరికా కబుర్లు --6
మర్నాడు కారు తెచ్చుకుందాము , arberatom చూద్దాము , ప్లస్ మెట్రో ఎలా ఎక్కాలో చూపుతాను అన్నాడు . సరే అని బయలు దేరాను. ఇంతకు ముందు సారి వచ్చినప్పుడు లక్ష్మీ వుంది నాతో. ఈ సారి ఒక్కతినే వెళదామని ఆలోచన.
అది ఎక్కి union Railway station కి వెళ్ళాలి . మధ్యలో ఏదో రిపైర్ వుండి అటు వెళ్ళదు అక్కడకి బస్సులు వేసాము -- షట్టిల్ సర్వీస్ - అన్నారు . ఇదేదో బాగానే వుంది . సరే అక్కడకి చేరాక ముందు కనపడింది స్టేషన్ బయట గోడ మీద వున్న వాల్ట్ విట్మన్ పోం లోని లైను . భలే గా వుంది .
తరువాత వాళ్ళ పోస్ట్ ఆఫిస్ . పెద్దది . కాని మెట్ల మీద ట్రాష్ . ఇంకా కొంచం ముందుకు వెళితే -- హోం లెస్ ఆఫ్రికన్ అమెరికన్లు -- ఆ చలికి , ఆరు బయట చప్టా పై పడుకుని వున్నారు . ఏ దేశమైనా ఇలాంటి దురదృష్టవంతులు వుంటారు . మా ఊళ్ళో ప్రకాశం బారేజి మీద .
లోపలకు వెడితే అక్కడ కార్ రెంటల్స్ . తీసుకుని ముందు arboretum ki వెళ్ళాము . మళ్ళీ ఇది DC లో 446 ఎకరాల పార్క్ .అందులో ఒక బొటానికల్ గార్డన్ . రకరకాల చెట్లు , ష్రబ్స్ పెంచుతారు , రిసర్చ్ కూడాను .
మధ్యలో పాత United Nations Capital building East Portico కి సంబంధించిన 22 Corianthan columns preserve చేసారు . వీరి ఆలొచన కి మెచ్చుకోవాలి . ప్రతీది దాయడం , దానికి ఒక చరిత్ర కల్పించడం , ఒక పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దడం . అసలు అలా చెయ్య దల్చుకుంటే మన దేశం లో అడుగుకి ఒకటి వుంటుంది . టికెట్లు పెట్టి సంపాదించవచ్చు . అన్ని కూల్చేసి రియల్ estate కానక్కరలేదు .
ఆ కాలంస్ ముందు ఒక చిన్న పాండ్ . చుట్టు జనాలు హాయిగా కూర్చున్నారు . పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు . కుక్కలు వాకింగ్ కి తీసుకు వచ్చారు .
లోపల బోన్సై గార్డన్ వుంది . అది చూడడానికి నేను ఎక్కువ ఉత్సుకుత చూప లేదు . అప్పటికే అలసి పోయాను .
అన్నట్టు అసలు ముందు Farmer's market చూసాము . అక్కడ నుంచి J.K. J K Mohana Rao గారు చెప్పిన సెకండ్ స్టోరీ కి వెళ్ళాను . ఆయన చెప్పినట్లు బయట కొన్ని పుస్తకాలు నాలుగు డాలర్లు అని వుంది . కాని అవి మోసుకు వెళ్ళాలి అని భయం వేసి కొనాలి అనే ప్రయత్నం చెయ్యలేదు . కాని షాప్ బాగుంది . పాత బౌండ్ పుస్తకాలు వున్నాయి


