అమెరికా కబుర్లు -2
కిందటి సారి చూడనవి ఈ సారి చూడాలి అని నిర్ణయించుకుని వచ్చాను . దాని కంటే ముందు మనుష్యులను కలవాలని వచ్చాను .
మా అబ్బాయి ఇంటికి సూర్యడి వెలుతురు బాగా వస్తుంది . ఆ వెలుతురు , వేడి చూస్తే చలి అనిపించదు . వాతవరణం చల్లగా వున్నా సరే.
మధ్యాహ్నం భోజనాలయ్యాక దగ్గర్లోనే వున్న జూ కి వెళ్ళాం . జూ అంత తిరిగే ఓపిక లేదు కాని వీలైనంత నడుద్దామని బయలు దేరాము . దారిలో పూల మొక్కలు సుశీల గారి ఫొటోలను గుర్తు చేసాయి . జూ లో ఆ పెద్ద చెట్లు , ఆ తీయని వాసనలు మోసుకు వచ్చిన గాలి బాగుంది కాని జంతువులని అలాచూడడం బాధ అనిపించింది. ముఖ్యంగా పాండాల కళ్ళలో ఆ నిరాసక్తత బాధ కలిగించింది . మనిషి క్రూరత్వంకి అది పరాకాష్ఠ!




No comments:
Post a Comment