Emotions recollected in tranquility -2
కాశీ ప్రయాణం -౨
హైదరాబాద్ చేరగానే మళ్ళి బయటకు వచ్చి బాగేజ్ చెక్ ఇన్ చెయ్యవలసి వచ్చింది . టికెట్లు తేదీలు మార్చడం వల్ల తిప్పలు ..నిమ్మి పులిహోర , దద్దోజనం విడివిడిగా pack చేసి తెచ్చింది . ముందు gate no 28 కి చేరి తాపీగా తిన్నాము . ఒక అరగంటలో విమానం ఎక్కమని పిలుపు . ఇది కొంచం పెద్ద విమానం . గంటన్నర లో వారణాశి లో దింపాడు .
ఏదో ఒక పుస్తకం లో కాశి దూరం నుంచి చూస్తే మండుతున్న అగ్ని గోళం లా ఉందని రాసారు . ఎవరి కర్మ ప్రారబ్దం బట్టి వారికి కనపడుతుందేమో . మేము దిగే టప్పటికి సూర్యుడు అస్తమిస్తూ కాశీ మబ్బుల్లొ ఉన్నట్లు ఉంది . చూస్తూ దిగి విమానం బయటకు రాగానే అద్భుతమైన సూర్య బింబం . ఫొటొ తీసాననుకున్నాను . కాని లేదు .
మా కోసం మా వియ్యంకులు ఏర్పాటు చేసిన driver cum guide ఎదురు చూస్తూ ఉన్నాడు . అతనే మా హోటల్ బుకింగ్ కి కూడా సాయ పడ్డాడుట . భార్గవికి వచ్చాము , hotel లో ఉండేందుకా గంగ దగ్గరకు వెళ్దాము అఅనిఆలొచన . దిలీప్ , మా driver cum guide ,,మీరు ఇవ్వాళ రెస్ట్ తీసుకొండి , రేపు పొద్దున్నే మీరు అడిగిన కాలభైరవుడితో మొదలు పెట్టి అన్నీ ఆరం సే చూపుతాను అని హామీ ఇచ్చాడు .
విమానాస్రయం నుండి పట్టణం కొంచం దూరం . అన్ని పట్టణాలు లాగానే ఉంది .
కాని ఇది ఇలాంటి అలాంటి పట్టణమా ! కాశీ !
Mark Twain అన్నాడుట :" ఈ నగరం చరిత్ర కంటే పురాతనమైనది . సాంప్రదాయం కంటే పురాతనమైనది ,గాధలు కంటే పురాతనమైనది . వీటన్నిటి కలిపి రెండింతలు చేస్తే , దాని కన్నా పురాతనమైనది ".
మా హోటల్ అమాయా cantonment లో ఉంది . అది తరువాత పెరిగిన నగరం . విశాలంగా రోడ్లు , మాల్స్ , ఏ పట్టణమైనా కావచ్చు . అయితే ఒక శుభ వార్త . మోడి గారు రావటం లేదు . యోగి గారి ప్రమాణ స్వీకారం Lucknow లో . ఇద్దరికి మనస్సులో ధన్యవాదాలు చెప్పుకున్నాము . మర్నాడు పొద్దున్నే ఆరుగంటలకు దేవాలయం అని అనుకున్నాము .మేము రూం కి వచ్చి స్నానాలు చేసి , భోజనం ఆయేసరికి eనిమిదిన్నర . ఇంక పొద్దున్నే లేవాలి అని నిద్ర పొయాము . అలా కాశీ లో ఒక రాత్రి . మూడు రాత్రులైనా కాశీ లో ఉండాలని శాస్త్రం .
ఆ రాత్రి వీరభద్రుడి గారి ' నేను నడిచిన దారులు 'పుస్తకం చదువుతూ పడుకున్నాము . ఇది మర్నాటి మా ప్రయాణం ప్లాన్ చేసుకునేందుకు సహాయపడింది . వీరభద్రుడి గారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment