Sunday, April 24, 2022

Emotions recollected in tranquility-8

 కాశీ యాత్ర -7

బుద్ధం శరణం గచ్చామి ! సంఘం శరణం గచ్చామి !

నాలుగు రోజులు తిరిగి ఇంత రాస్తున్నావేమి అని నవ్వుకుంటున్నారా ? ఏదో ఆలొచనలు పంచుకుందామని . 

   మధ్యాహ్నం నాలుగింటికి బయలుదేరి సార్నాథ్ వెళ్ళాము . సారనాధ్ , వారాణాశి కి ఏడు , ఎనిమిది కిలో మీటర్లు దూరం లో ఉంది . మన హైదరాబాద్ , సికిందిరాబాద్ లాగ . అరగబంట లొపే చేరాము . అక్కడ ఆర్కియాలజి మ్యూజియం , బౌద్ధ స్థూపాలు రెండు ఉన్నాయి . మ్యూజియం , సార నాధ్ స్తూపానికి అయిదింటికల్లా మూసేస్తారు అన్నారు .ముందు బౌద్ధ దేవాలయానికి వెళ్ళాము . నిజానికి దాని వెనకాల ఒక రిట్రీట్ సెంటర్ ఉందిట . అది తరువాత తెలిసింది . మా అబ్బాయి ఒక వారం రోజులు అందులో ఉన్నాడు . 

హిందూ మతమే కాక బౌద్ధానికీ కాశీ ముఖ్య మైన ప్రదేశము . బుద్ధుడు తన మొదటి తపస్సు ఈ అడవులలోనే చేసాడుట . ఆ రోజుల్లొ కాశీ పట్టణం చుట్టూ అడవులు , ఎన్నో చిన్న చిన్న మడుగులుతో ఎంతో ప్రశాంతం గా ఉండేదిట. ఇప్పుడు చూద్దామన్న ఏమీ లేవు . అలాంటి అడవిలో తపస్సు చేసి ఇది మార్గం కాదని వెళ్ళిన సిద్ధార్ధుడు , తనకు బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యాక ముందుగా తనకి తెలిసిన సత్యం తెలియజేయడానికి సారనాథ్ వచ్చి అక్కడ తన మొదటి భాషణ ఇచ్చారు . ఆ ప్రదేశం చూపిస్తారు . ఆ భాషణ విన్న ఆయనతో పాటు అంతకు ముందు తపస్సు చేసిన స్నేహితులు ఆయనకి ముందు శిష్యులయ్యారు . ఈ ప్రదేశాన్ని సంఘారామ అంటారు . మధ్యలో 60 మీటర్లు ఎత్తు విహారం వుంది . ఆ విహార కప్పు పైన బంగారు మామిమామఉంది  .మధ్యలో ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉంది . ఆయన జ్ఞానం పొందిన బోధి చెట్టు కొమ్మ అక్కడ నుండి తెచ్చి ఇక్కడ పెట్టారుట . అది ఇంకా ఉంది . నిజానికి బోధ్ గయ లో అసలు చెట్టు పడిపొతే మళ్ళీ ఈ చెట్టు కొమ్మని అక్కడకు తీసుకుని వెళ్ళి పాతి పెట్టారుట . ఇప్పుడు బోధ్ గయ లో ఉన్నది ఆ చెట్టు . 

   మొదట భాషణ ఇచ్చిన ప్రదేశం లో ఒక స్తూప ఉంది . మన అశొక స్తూపనికి నమూన నాలుగు సింహాలు అక్కడ ఉంది . అలాగే బామియాన్ బుద్ధుని విగ్రహాలు ఆఫ్ఘనిస్తానులో తాలిబాన్లు పేల్చేసాక అదే నమూన తో థాయి లాండ్ ప్రభుత్వం తో కలిసి 80 అడుగుల విగ్రహం నిర్మించారు . ఇది చెయ్యడానికి 14 సంవత్సరాలు పట్టింది . బుద్ధ విగ్రహం ముందు ఆహ్లద కరంగా ఒక నీటి మడుగు కలువలు , తామరలతో ఉంది . వాటి ఎదురుగా మాయదేవి విగ్రహం ఉంది . ఆ ప్రదేశం అలా గబ గబా చూడాల్సిన ప్రదేశం కాదు . ఆ ప్రశాంతత కూర్చుని అనుభవించాలి . 

మ్య్యుజియం మూసేస్తారని అటు వెళ్ళాము . టికెట్టు తెచ్చుకోడానికే పది నిమిషాలు పట్టింది . బాగులు బయటే ఇచ్చేసి లొపలకి వెళ్ళాము . చాలా ఉంది చూడడానికి . గబ గబ నాలుగు గదులు చుట్టేసాము . ముందు ఆకర్షణ original నాలుగు సింహాల స్తూపం . చరిత్ర విద్యార్థులకి ఒక పండుగ . మళ్ళీ మూసేస్తారని అశోకా స్తూపానికి వెళ్ళాము . 

అక్కడ చాలా నడక ఉంది . పాపం అప్పటికే భార్గవికి , నిమ్మికి పాదాలు వాచి ఇబ్బంది పెడుతున్నాయి . వారిని అక్కడ కూర్చొమని నేను ప్రసాద్ గారు లోపలకి వెళ్ళాము . 

  అది ధమేక స్తూపం . మొదట క్రీ . పూ .249 లో అశొకడు కట్టించిన ఆ స్థూపానికి క్రీ . పూ .500 లో మొదటి కట్టిన స్థూపం మెరుగు పరచడమే అని ఆధారాలు చెపుతున్నాయి . అక్కడ ఒక మహా చైతన్యం ఉండేదిట . దాదాపు 1500 మంది బౌద్ధులు అక్కడ నివాస ముండేవారని విదేశీ యాత్రికుని xuanchang రాతలలో ఉంది . ఇప్పుడు ఆ అవశేషాలు ఉన్నాయి . ఎంత ప్రశాంతత ! ఆ స్థూపం పరిక్రమ చేస్తే -- ఇది ఎలా కట్టగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది . అదీ అలా గబగబా చూడాల్సిన ప్రదేశం కాదు . అక్కడ ఒకామె బయట నిల్చుని అడిగారు -- ఏమండి ఆ స్థూపం లోపల ఏమైనా ఉందా ? మా గైడ్ అక్కడ ఏమి ఉండదు రాళ్ళు రప్పలు తప్ప అన్నాడు .నేను ' మన ఆసక్తిని బట్టీ ఉంటుంది . స్థూపం లో లోపల ఏమీ లేదు . వెళ్ళే మార్గమూ లేదు . అన్నాను . 

    ఇక టైం అయ్యిందని బయటకు వచ్చాము . కానీ మళ్ళీ వెళ్ళాలి . అప్పటికి అందరం అలిసిపోయి వెనక్కి వెళ్ళాము . 

No comments:

Post a Comment