Emotions recollected in tranquility!
నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .
నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .
చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .
ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ !
సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం !
ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ ! ( కింద చూడుడు )
నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి .
ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ?
అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . eఎదుట్ సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు ( భార్గవి తో కూడా ఒక ఫోటో ఉండాలి )
Emotions recollected in tranquility!
నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .
నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .
చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .
ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ !
సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం !
ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ
నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి .
ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ?
అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . ఎదుట సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు .
No comments:
Post a Comment