యాత్ర స్పెషల్ -10
ఉత్తర కాశీ నుండి పొద్దున్నే బయలు దేరాలి అంటే ఒక పక్కన హమ్మయ్య అనుకున్నా మరో పక్క పొద్దున్నే లేవడానికి బాధ . కాని తప్పదు. ఆరింటికి అనుకుని ఎనిమిదికి బయలుదేరాం. దారిలో భోజనాలు పూర్తి చేసి సాయంకాలనికి బదరీ చేరాం.
బదరీ చల్లగానే వున్నా వణికించే చలి కాదనుకున్నాం. కాని మేము దిగిన హోటల్ ' సరోవర్' electric blankets, room heaters పెట్టాడు. రాత్రి అయ్యేసరికి చల్లబడింది. సాయంకాలం దిగగానే యుక్త వయస్సులు - శారీరకంగానైనా, మానసికంగానైనా - పరుగులు తీసారు దర్శనానికి. నేను ముందే తెలుసుకున్నా కదా నాకు పెద్ద వయస్సు వచ్చిందని, అందుకే రెస్ట్ తీసుకుని రాత్రి తినేసి పడుకున్నాను. మా చెల్లెలు వెళ్ళింది.
బదరీ గుడి దాకా కార్లు వెళతాయి . హమ్మయ్య అనుకున్నాను.అబద్ధం. పోని సగం నిజం. పార్కింగ్ దగ్గర నుండి మెట్లు ఎక్కాలి , ఎత్తులు పల్లాలు. పొద్దున్నే లేచి స్నానాలు పూర్తి చేసుకుని టాక్సీ ఎక్కాము. గుడి దగ్గరే! నడవగలిగే వారు నడుస్తారు.మా టాక్సీ జనం లేని చోట ఆపాడు కాని దూరం . నిర్మొహమాటంగా పుట్టి ఎక్కాను. మొదటి సారి తప్పు అనిపిస్తుంది కాని రెండో సారి అంత వుండదు. మూడోసారికి అలవాటవకూడదు అని ప్రార్ధించుకున్నాను .
శ్రీనివాస్ ముందే వెళ్ళి ఏర్పాటు చెయ్యడం వలన అందరం ఒక సారి లోపలకు వెళ్ళి పూజ చూసి ఆరతి చూసి బయటకు వచ్చి నాము .
ఆ గుడికి ప్రధాన అర్చకుడు మళయాళం మనిషి. వారిని కూడా చూసి బయలు దేరాము. వెళ్ళేటప్పుడు దగ్గర దోవలో వచ్చి -- ఈ సారి నడిచే - , టాక్సి ఎక్కేసాము.
భోజనం చేసి రెస్టు తీసుకున్నాము.




No comments:
Post a Comment