యాత్రా స్పెషల్ -5
పొద్దున్నే , అంటే పది అయ్యింది . బార్కోట్ నుంచి ఉత్తర కాశీ బయలుదేరాము .
గంగ ఎక్కడెక్కడ ఉత్తరం వైపు తిరిగి -- పుట్టిన చోటు వైపు - మళ్ళీ వెనక్కి వెడుతుందో అక్కడక్కడ ఒక కాశీ ట . అదో పుణ్య స్థలం , శివుడి గుడి . నేనీ కథ విన్నప్పుడు అత్తింటికి వెళ్ళే ఆడపిల్ల మధ్య మధ్య లో వెనక్కి తిరిగి తల్లిదండ్రులను చూసిన దృశ్యం తోచింది . అంటే ఈ సీను ఇది వరకు రోజుల్లో లెండి . ఇప్పుడు ఆ ఏడుపులు , మొత్తుకోళ్ళు లేవు గదా !
వాతవరణం మారుతోంది . చల్ల దనం పెరిగుతోంది . దేవదారు వృక్షాలు నిటారుగా నిల్చుని వున్నాయి .దారిలో మొన్నా మధ్య టన్నల్ లో ఒక ముప్పై మంది ఇరుక్కుపోవడం , బయటకు తీయడం చదివాము కదా . ఆ టన్నల్ చూసాము . ఇంకా పనులు జరుగుతున్నాయి . ఆ మట్టి కొండలు వ్యవహారం చూస్తే ఇలా కొండలు తొలచడం ఎంత వరకు సబబో తెలియలేదు .సరే . ఆ వ్యవాహారం ప్రకృతి చూసుకుంటుంది అనుకున్నాము.
ఇక ఉత్తరకాశి చేరేసరికి పరుగులు తీస్తూ భాగిరధి ! ఇదీ గంగ అంటే .!!!. మధ్యాహ్నం భొజనాల తరువాత తపోవన మహరాజ్ ఆశ్రమం , తపోవన కుటీర్ చూసాము . అక్కడే స్వామీ చిన్మయానంద రూము , వారు వాడిన వస్తువులు కొన్ని ఉన్నాయి . చిన్మయా మిషన్ ఆరంభ స్థలం అది . కొన్ని విశషాలు చెప్ప్పారు స్వామిజి . ఇక అక్కడ నుండి గంగ దగ్గరకు వెళ్ళాము . పరుగులే పరుగులు .. సుళ్ళు తిరుగుతూ వేగంగా పరుగెడుతోంది గంగ ! ' గంగా ఆయి కహా సే ? గంగా జాయి కహా సే ' అనే హేమంత కుమార్ పాట తిరుగుతోంది ఒడ్డున ఒక సన్యాసి , సెల్ ఫోన్ లతో చెప్పులు వేసుకుని వచ్చి కూర్చున్నారు . అదీ మన దేశం లోని వైవిధ్యం !
అందరం చేరి గంగా స్త్రోత్రం చేసి , కాసేపు అక్కడే కూర్చుని సౌమ్య కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్నాము . ఉత్తర కాశీని సౌమ్య కాశీ అని కూడా అంటారుట . శివలింగం స్వయం భూ ట . పెద్ద జనం లేరు . దర్శనం చేసుకున్నాము . దేవాలయ ఆవరణలో ఒక హనుమాన్ మందిర్ వుంది , గుడికి పక్కన ఒక హనుమాన్ మందిర్ వుంది . రెండూ చూసాము . సాయంకాలం కదా ఎక్కువ మంది జనం లేరు . అన్నట్లు ఈ శివునికి ఒక రాజు గారు 20-25 అడుగులో త్రిశూలం లోహంతో తయారు చేసింది సమర్పించుకున్నారుట . అది విడిగా ఒక మందిరం లో పెట్టారు .
రేపు పొద్దున్నే గంగోత్రి ప్రయాణం తో మరో రోజు గడుస్తుంది





No comments:
Post a Comment