యాత్ర స్పెషల్ -3
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకు వచ్చాము . మా సామాను మేమే దించుకుని ( సమయం ఎక్కువ అవుతందని , బాధ్యత వహించాలని కూడా ) దింపుకున్నాము . మాకు నిర్దేశించిన బస్సులో కి ఎక్కాము . ముందరే అడిగాము - ఘాట్ రోడ్డా ? అని . అవునన్నారు . ఘాట్ మొదలవుతుంది .
దెహ్రాడూన్ మీదుగా వికాస నగర్ అని కొంచం ఊరికి దూరాంగా ఒక లోయలో ఉండే హోటల్ లో భోజనం అన్నారు . అయితే దారిలో తప్పు దోవన వెళ్ళి ఒక గంట అటు ఇటు తిరిగాము .ఇందాకే అన్నాను కదా -- బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు . అంతేమి లేదు. కొన్ని బస్సులకి Qపర్మిషన్ లేదుట .మధ్యలో తరువాత చేరారు కనుక వారికి పేపర్లు రెడి చెయ్యాలి . దానితో 1.30 కి చేరవాల్సింది సాయంకాలాం 3.00 కి చేరాము .
వేడి , వేడి గాలులు .. అయితే ఆ ప్రదేశం ఎంతో అందం గా వుంది . బహుశ వానా కాలం లో బ్రహ్మాండంగా వుంటుంది . కింద లోయలో నది .చుట్టూ కొండలు . పక్కన గుడిసె లలో మనం అది ఊహ ! నిజంగా అలా ఉండాలంటే మనకు ఆ ధైర్యం , ప్రకృతి తొ అంత మమేకం అయ్యి ఉండాలి . ఫొటొలకు బాగుంటాయి .
ఇక ఇక్కడి నుంచి ఒక కొండ ఎక్కడం , ఒక కొండ దిగడం . ఎండిన చెట్లు . మన తిరుపతి లా వుంటుంది . అయితే చెట్లు రకాలు వేరు .
ఇంక ఇలా రెండు గంటలు . 90 కి మాత్ర మే దూరం . అయినా కొండ దారి కనుక టైం పడుతుంది . ఇక నుంచి బారాకో ట్ .




No comments:
Post a Comment