యాత్ర స్పెషల్ -8
కేదార నాధ్ కి 4.30 కి బయలుదేరి ముందుగా సోనే ప్రయాగ్ కి చేరాం. అక్కడ నుంచి గౌరి కుండ్కి వెళ్ళాలి. ప్రభుత్వ వుత్తరువుల ప్రకారం అక్కడ నుంచి కొన్ని సుమోలు ఎక్కి ముందుకు వెళ్ళాలి. మనకి తోడు అలకనంద. ఇక అక్కడ నుంచి ఇంక కొంచం దూరం వెళ్ళాక గుర్రాలు కాని, డోలీలు కాని , పుట్టీ కాని ఎక్కాలి.
డోలీ అనుకున్నాను కాని అవిదొరకలేదు. అందుకని గుర్రం ఎక్కవలసి వచ్చింది.
నా వయస్సు 65 అని, నేను ఎత్తు మెట్లు ఎక్కలేనని పూర్తిగా రూఢి అయింది . సాయంలేకుండా ఒక్క నాలుగు అడుగులు వేయలేనని తెలిసింది. అంటే మాములు రోడ్డు పైన చకచక నడిచే నేను కొంచం inclined గా వుంటే నా వల్ల కాలేదు. ఒక్క మాటతో అందరూ altitude effect అన్నారు.
గుర్రం మంచిది అవ్వాలి, గుర్రం తోలే వాడు మంచి వాడు కావలి. నాలు గు గుర్రాల కలసి వెళ్ళాలి . కొంచం భయపడ్డాను కాని గుర్రం , తోలేవాడు మంచి వారు. ఇబ్బంది పడలేదు . మా జీ అంటూ బాగా చూసుకున్నాడు.
దారిలో రెండు చోట్ల ఆగి టీ తాగం . పైకి వెళ్ళడమే! మలుపులు , మలుపులు.రోడ్డు కాదు రాళ్ళు . గుర్రాలు కావవి. కంచర గాడిదలు. ఒక్కోసారి వాటికాళ్ళు జారుతాయి. అందులో వాన మథ్య మధ్య లో పడుతూనే వుంటుంది. మేము మధ్యలో ఆగినప్పుడు ఒక సారి కుండలు బోర్లుచ్చినట్లు . అదృష్టవశాత్తు మేము అప్పుడు తడవ లేదు. కాని తరువాత వానలో తడవక తప్పలేదు. పైన రెయినకోట్ వున్నది కాని కొంచం తడిసాము. ముఖ్యంగా సామాను. వారి కష్టం మాములుది కాదు . నేను ఆ గుర్రం మనిషి తో మాట కలిపాను. అతను కూడా సీజనవగానే వేరే పనికి వెడతారుట. అతను వంటపనికి మహరాష్ట్ర కాని , మరోచోటుకి కాని వెడతాడుట. ఎందుకని అడిగాను . ఈ డబ్బు మిగతా చోట్ల రాదుట. అందుకని ఈ అయిదారు నెలలో వచ్చేస్తాడుట.
అలా పైకి వెళ్ళేసరికి ఓపికయి పోయింది . కాని పైన దూరంగా హిమాలయాలు. దూరంగా మంచు కురుస్తూ - ఫోటోలలో చూసిన్నట్లు . ఫొటో లో ఆ అందం కంటే ఆ హుందాతనం ఫొటోలు పట్టుకోలేవు.
మథ్యలో మబ్బులు . ఒకసారి అవి కింద ఉంటాయి . ఫోటోలు తీయలేదు. అసలు చూడడమే కాని ఫోటో ఆలోచన రాలేదు .
పైకి వెళ్ళాక ఇక రెండు ఫర్లాంగులు నడవాలి. అప్పడు ఇక నావల్ల కాదని ఒక పుట్టు ఎక్కాను. చాలా గిల్టీగా అనిపించింది . రెండు ఫర్లాంగులకి మధ్యలో ఆగాము. వాన కి కవరని ఒక ప్లాస్టికి్ కవరు ముఖం మీదవేసాడు. అసలే ఆక్సిజన్ తక్కువ. నావల్ల కాదని తీసేసాను. అతని బాధ పుట్టి తడుస్తుందని. చివరికి నా చేతిలో ఉన్న కర్ర తో పైకి లేపి పట్టకొండి అన్నాడు. అది పరవాలేదనిపించింది.
అందరు కలిసాక గ్రూప్ లోని వారందరు సాయం చేసి సామాను రూంలో పడేసారు. నాతో మల్లి , దీప్తి, శ్రీనివాస్ లేకుండా వుంటే నా వల్ల అయ్యేది కాదు. అలా నా పక్కనే వున్నారు. ఇక గ్రూప్లో మిగతా వారు కూడా ఎంతో సాయం . కలిసి వెళ్ళడం లో పరమార్ధం అదే కదా. తోటి మనిషి విలువ తెలియం
చేరగానే ముందు గుడికి దర్శననాకి వెళ్ళాం . గుడి ఎంత అందంగా వుందో ! అలంకారణ కూడా చాలా బాగుంది . జనం ఎక్కువ లేరు. పైగా పౌర్ణమి !! ఒక పక్క శరీరం ఇబ్బంది వున్నా హాయిగా వున్నది. మల్లి( మా చెల్లెలి ), బట్టలు వాన లో తడిసాయి. తను గబాగబా వెళ్ళి కొనుక్కుని వచ్చింది. ఇంకా కొద్ది మందికి అదే అనుభవం .భోజనం ఆలు , రోటి. తిని పడుకున్నాం . పొద్దున్నే 3.30-4.00 కి ప్రధమ దర్శనం , పూజా అని ప్లాన్ .





No comments:
Post a Comment