యాత్ర స్పెషల్ -2
డిల్లి లో ఒక హోటల్ లో అందరం చేరాము . వీళ్ళ మానేజి మెంట్ బాగా ఉంది . అందరికీ యాత్ర కి వెళ్ళే పర్మిషన్ కాగితాలు ఇచ్చారు . ఇక్కడే మన భారతీయత తెలుస్తుంది . ఏజంట్ అందరికి చెయ్యించాడు -- ఆయనకి తోచిన వయస్సు , జెండర్ రాసేసాడు . ఫో నంబర్లు ఆయనవి . ఆధార్ ఆయనది . అలాగే ప్రభుత్వం ఒప్పేసుకుంది . వారికి కావల్సింది నంబర్ . అంతే . ఒక రూల్ పెట్టి అది పాటించక్కర్లేదు అని చెప్ప్పేది ప్రభుత్వమే . మరి పల్లెటూరు వాళ్ళు ఎలా చేయగలుగుతారు ? పల్లెటూరే కాదు , ఎవరికైనా ఒక్కరే వెళ్ళేవాళ్ళకు ఇబ్బంది . నా వయస్సు -53 -- ok, gender -M-- NOT Ok.
చేసేది ఏమీ లేదు . మాతో వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది NRI లు . కనుక యాత్ర లో సౌకర్యాలు కూడా బాగానే వున్నాయి .
డిల్లి లో 11 ఇంటికి బయలు దేరితే ఒక రెండు గంటల ప్రయాణం తరువాత - మీరట్ చేరాము . అక్కడ భొజనము . వేడిగా , బాగుంది . అక్కడొక బోర్డ్ -- కింద పెట్టాను . మగవారు ఎక్కుడున్నా వాళ్ళేదో భార్యలను చూస్తే భయపడి పోతున్నట్లు బిల్డప్ 

మళ్ళీ మీరట్ నుంచి రెండు గంటలు ప్రయాణం తరువాత హరి ద్వార్ చేరాము. అక్కడ హోటల్ లో చెకిన్ అయి ఫ్రష్ అయి గంగా హారతి చూడడానికి వెళ్ళాం .
ఒకావిడ - గుజరాతీట- ఏమిటో ఇప్పుడు కూడా హరిద్వార్ లో ఇంత చెత్త వుంది - అని అంది . ఆవిడ ఉద్దేశం మోడిగారు వచ్చాక కూడా !!
దానికి మా ఆర్గనైజర్ చెప్పాడు - దేశంలో అన్ని మూలలు నుండి లక్షల మంది జనం వస్తారు , అలా చూస్తే చెత్త లేనట్లే -- అని . అతనే అన్నాడు -- నమ్మిన వారికి గంగా మా , లేని వారికి బెహతా పానీ అని
గంగా మా అని వచ్చేవారు తక్కువ కాదు -- ఆ జనం చెపుతున్నారు
సాయంకాలం గంగా హారతికి చేరాం !! జనం, జనం జనం -- అన్ని వయసు వాళ్ళు , అన్ని జాతులు , అన్ని రంగులు . ఆ జనంని గమనించుకుంటూ నడవడం ఒక అనుభవం . గంగ ఒడ్డున కూర్చున్నాము . కూర్చోవడానికి ప్లాస్టిక్ కాగితం అమ్మే వారు , మంచి నీళ్ళు అమ్మే వారు , సందట్లో సడేమియాలు -- గంగా హారతీ చూస్తూ దానం ఇమ్మన్నే వారు , అడ్డ బొట్టు , త్రిశూలం బొట్టు పెట్టే పిల్లలు , హడావిడి --
పైన వేడి , గాలి వేడి -- చెమట -- కాని ఎంత భక్తి . ఎవరు తగ్గలేదు .
గంగా పరవళ్ళు తొక్కుతూ ఉంది . ప్రవాహం ఉరవడి . స్నానాలు చేసే వారు చేస్తున్నారు . బయట వేడికి , గంగ నీరు చల్లదనానికి దాదాపు 15 డిగ్రీలు తేడా ఉంది . అందుకు స్వామిజి స్నానం చెయ్యుదన్నారు . అందుకే కాళ్ళు తడపుకుని వచ్చాము .
కాసేపు కూర్చుని సరికి కాళ్ళు నొప్పి పెట్టాయి . ఇంక లేచి ఫోటొలు తీసుకుని అందరి భక్తి గమనిస్తూ కూర్చున్నాను . ఆసక్తిగా వుంది !
రోడ్డు మీదకి వచ్చేసరికి కొంచంగా తడిసిన బట్టలు ఆరి పోయాయి. అంత వేడి . పెద్ద పెద్ద శివుని విగ్రహాలు . శివాళిక్ పర్వత శ్రేణి మొదలవుతోంది . ఒక చిన్న కొండమీద మానస దేవి మందిరం . కింద చండి దేవి మందిరం . రెండూ చూడ లేదు .





No comments:
Post a Comment