Sunday, July 14, 2024

Yatra Special-6

 యాత్రా స్పెషల్ - 6

ఇక ఇవ్వాళ మా ప్రయాణం గంగోత్రి కి .
అమరేంద్ర దాసరి ఎప్పుడు అంటూ ఉంటారు గమ్యం కాదు ముఖ్యం ప్రయాణం అని . ఈ తీర్థ యాత్రలలో కూడా అదే ! అక్కడ గుడి చిన్నదే . మన శ్రమే ఫలం .
గంగోత్రి కి పొద్దున్నే q6.00 కి బయలుదేరాము . అంతా కొండ దారి . పక్కన్నే గంగ కనపడుతూ ఉంటుంది . ఏ మూల నుంచో ఆ ధారా పడుతూనే వుంటుంది . ఒక్కొ క్క చోట దారి పై నుంచి రాళ్ళు పడడం వల్ల చిన్నది గా వుంటుంది . సింగిల్ రోడ్డు . వాహన చోదకులు జాగ్రత్తగా పోనీయాలి . మా వాన్ డ్రైవర్ చిన్న వాడే కాని చాలా జాగ్రత్తగా పోనిచ్చాడు . ముఖ్యం గా డిల్లి నుంచి వచ్చే దభ్భున్న వాళ్ళతోనే కష్టం . ఇక్కడ కూడా అలాగే డిల్లి లో పోనిచ్చినట్లు పోతూ ఉంటారు .
భయపడినట్లే ఎక్కడొ ఒక accident అయ్యిందిట . traffic jam . అయితే పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి , పైకి వెల్లే వాహనాలని ఆపి , ముందు దిగే వారిని పంపించే యేర్పాటు చేసారు . అది చెయ్యడానికి ఒక రెండు గంటలు పట్టింది . అక్కడే ఒక మైలు దూరం లో ఉన్న టీ స్తాల్ కి పోయి పఫ్ఫ్ , మాగ్గీ తిని టీ తాగాను .
అసలు నాకు మాగ్గీ అంటేనే పడదు . అలాంటిది అక్కడ చలి కాలం ఎక్కువ కూరలు దొరకనప్పుడు వారికి మాగ్గి ఆధారం అవుతుందిట . హోటల్స్ లో అదొక డిష్ గా offer చేస్తున్నారు . కంపెనీ వాడు కూడా ఇది ఆలోచించి వుండడు .
దారిలో పీచ్ , ఆల్బుకరా పళ్ళు తిన్నాము . ఇంత రుచిగా వుంటాయని తెలియదు . ముజ్జఫర్ నగర్ మామిడి ట . చిన్నవి కాని భలే రుచి . అరటి పళ్ళు మాత్రం మన వైపు వే బాగుంటాయి .
దారిలో ప్రకృతి అందం చాల సేద తీరుస్తుంది . దూరం నుంచి మంచు కొండలు పలకరిస్తున్నాయి. అది ఆకాశమా ? కొండ అంచా ?
రెండు గంటల తరువాత ంబయలుదేరి గంగోత్రి కి చేరేసరికి 2.30, అయ్యింది . ఈ మాగ్గి నన్ను రక్షించింది . తెలుగు వాళ్ళు కనపడుతూనే వున్నారు. గంగ నాని అనే ఊరు దగ్గర ఆగాము . అక్కడ కూడ ఒక hot water spring వుంది . అక్కడ కూడా జనం . జగిత్యాల నుంచి వచ్చిన కుటుంబం పలకరించారు . టీ తాగిన చోట కూడ ఎనిమిది మంది కుర్రాళ్ళు జగిత్యాల నుంచి వచ్చారుట .
గంగోత్రి చేరి అక్కడ ముందే ఏర్పాటు చేసిన చోట భోజనం కానిచ్చాము . వయస్సుకి సంబంధం లేదు అందర్కి చేతిలో కర్ర వుంటే మోకాళ్ళ మీద ప్రెషర్ వుండదు .
ఇక అక్కడ నుంచి గంగ దగ్గరకి వెళ్ళాము . మహా ఉద్దృతంగా ఉరకలు వేస్తోంది గంగా . స్వామిజీ అందరూ స్నానం చెయ్యల్సిందే అని చెప్పారు . నేనూ ఇంత దూరం వచ్చి చెయ్యకుండ ఎలా అని . దానికి తోడు ముందు నుంచే స్నానం చెయగానే ఆ చలికి ఏమేమి బట్టలు అవసరమవుతాయో , ఎలా పాక్ చేసుకోవాలో detailed instructions ఇచ్చారు .ఆడవాళ్ళ కొరకు tent తెచ్చారు .
అందరము ఒకళ్ళ తరువాత ఒక్కళ్ళు కూర్చుంటే స్వామిజి ఒక బకెట్ తో ఎత్తి నీళ్ళు పోయడం . గడ గడ వణకడం , చల్ల నీటితో షాక్ తో లేచాను . రెండు అడుగులు ఎలా వేసాను తెలీదు . కళ్ళ జోడు పెట్టుకోలేదు . మెట్టు కనపడలేదు. తట్టుకుని పడ్డాను . అందరూ గబగబవచ్చారు . కాని దానితో మళ్ళీ స్పృహలోకి వచ్చాను . dress మార్చుకున్నాము . దెబ్బేమి తగలలేదు. రెండు కాళ్ళవేళ్ళు కొంచం వత్తిడి అయ్యి blue black అయ్యాయి . పక్కన చెల్లెలు , కజిన్ దీప్తి , శ్రీనివాస్ స్ప్రే కొట్టి , మందులు ఇచ్చి attend అయ్యారు .
మెల్లగా గంగా దేవి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము . మెల్లగా బయలుదేరి తిరిగి ఉత్తరకాశి వచ్చేసరికి రాత్రి 10.30 అయ్యింది . భొజనం అయ్యిందనిపించి పడుకున్నాం . రేపు గుప్త కాశి .
All reactions:
Sarath Chandra Balantrapu, Rompicharla Bhargavi and 40 others

No comments:

Post a Comment