Sunday, July 14, 2024

Yatra Special-9

 యాత్ర స్పెషల్ -9

కేదార్ నాధ్ కి వెళ్ళే గుర్రాలు , మాలీలు - అన్నీ మంచివే వుంటాయని గారంటీ లేదండి. మాతో గ్రూప్ లో వచ్చిన ఒకాయన కింద పడ్డారు. మరోకామె saddle తో సహా పక్కకు పడిపోయారు. అయితే. ఎవరికి దెబ్బలు తగలలేదు. మా చెల్లి ఎక్కిన గుర్రం కుంటిదిట. అది కొంచం సేపటికి గమనించింది . చాలా బాధ పడి వేరే దానికి వెడతానంటే వీడు ఊరుకోడు. ' ఏం లేదు బాగానే వుంది మాజీ ' అంటాడుట. ఓ పోలీసు గమనించి ఆపితే వాడికి ఒక రెండు వందలిచ్చి వదిలించుకున్నాడట. అలాగే ఆ గుర్రం పైకి ఎక్కింది . ఇందులో ఇన్ని లొసుగులు వున్నాయి .
మాకు ఒక ఆరుగురికి ఒక డార్మిటరి . అయితే వేడి నీళ్ళు వస్తాయి . తెల్ల వారు జామున నాలుగింటికి దర్శనం అన్నారు. ఆ టైం వినగానే నేను మా చెల్లెలు మాది ధూళి దర్శనమే అని నిశ్చయించుకున్నాము . కాని మా రూంలో కొంచం పెద్ద వారు రెండింటికి లేచి వేడి నీళ్ళతో స్నానం చేసి బయలు దేరారు. వారికి నా జోహార్లు.
మూడున్నరకి అక్కడ తెల్ల వారింది . అంటే వెలుతురు వచ్చింది . అక్కడ గుడిలోకి చెప్పులు వేసుకోరు . అలా వచ్చిన భక్తులకి జోహార్లు. అప్పటికే గుడి ముందు వుండే మూడు లైన్లు నిండి బయటకి పరుగులు తీసింది క్యూ. మేమూ చేరాము . అందుకే గుడి లోపలకి వెళ్ళే లైను వచ్చే దాక షూ విప్ప లేదు .
గంటయింి , రెండు గంటలైంది , మూడుగంటలయింది . క్యూలో నిల్చున్నాము. కొందరికి విసుగొచ్చి వెళ్ళి పోయారు. అప్పుడు గుర్తు కు వచ్చింది ఆ రోజు సోమవారం .
క్యూ విషయం లో మన తిరుపతి ఇంకా కొంచం organised గా వుంటుంది . క్యూ లో ఎవరైనా దూరబోతే అందరూ ఒక్క గొంతుతో అరవడం . లోపలకి వెళ్ళాక మాములే . తోసుకోవద్దు , తోసుకోవద్దు అంటూ అందరూ తోసుకోవడమే . మా శ్రీనివస్ ముందే ఒక పండితడు తో మాట్లడి ఉంచాడు . ఈ మనుష్య్లందరిని తోసుకుని వెళ్ళాక లోపల పూజా మా చేత చేయించాడు . అది స్వయం భూ లింగం కనుక అందరూ చెయ్యచ్చు . అందరూ ముట్టుకుని , ఆ లింగానికి అభిషేకం చేసీ చేసీ అది ఒక అరిగి పోయి , ఆకారం మారి పోయింది . ఒక మూడు నిమిషాలలో నీరు , నెయ్యి , మారేడు దళాలు పూజ చేసి బయట పడ్డాము.
ఇంకా ఎటు వెళ్ళ డానికి ఓపిక లేదు . అందరం సత్రం చేరి బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి బయట పడేసరికి ౧౦.తిరుగు ప్రయాణం . నేను క్లీయర్ -- కొంచం దూరం కూడ నడవను . పుట్టీ ఎక్కి గుర్రాలు దగ్గరకు వచ్చేసరికి డోలీలు వున్నాయి . మొహమాటం లేకుండా నేను , మా చెల్లి డోలి మాట్లాడూకుని ఎక్కేసాము . వాళ్ళు మెల్లగా నడుస్తూ బయలుదేరరు . మళ్ళీ వర్షం ! ఈ సారి తెలిసిపోయింది కదా ! 200/- పెట్టి ప్లాస్టిక్ రైన్ కోట్ కొని నేను వేసుకొని. అలాంటివే ఇంకో రెండు కొని సామను కి కూడా చుట్టేసాను . సామాను తడవలేదు . మనకి మాత్రం ఏదో ఒక మూల నుంచి తడుస్తూనే వుంటాము .
అక్కడ నుంచి దిగడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు . అయిదు గంటలలో దిగారు . కాని నడిచేవారు , గుర్రాలు , డోలీలు , పుట్టీలు. ఎక్కే వారు ,దిగేవారు అంతా ఒకేతోవ ! ఇంక ఎంత గందర గోళంగ వుంటుందో ఊహించ వచ్చు . ఆ గాడిదలు వాటి దేహా కార్యక్రమాలు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే వాటిని క్లీన్ చెయ్యడానికి మనుష్యులు వుంటారి . మరీ బురుదగా వుంటే నీళ్ళు పోసి కడుగుతున్నారు. శౌచాలయాలు ఉన్నాయి . ప్రాథమిక చికిత్సా కేంద్రాలు - మనుష్యులకి , జంతువులకి ఉన్నాయి.
కిందకు చేరి మళ్ళీ సుమోలు ఎక్కి కిందకు దిగాము . అడుగడుగికి ట్రాఫిక్ జాం లు . అక్కడ నుంచి మా రూములు కి చేరి పెందరాడే భొజనం చేసి పడుకుంటే -- ఇంక ఒళ్ళు తెలీదు
All reactions:
Venkob R Balantrapu, Manoja Namburi and 44 others

No comments:

Post a Comment