యాత్రా స్పెషల్ -4
ఇవ్వాళ పొద్దున్న 5.00 కి రెడి అయ్యి బ్రేక్ ఫాస్ట్ అయ్యిందనిపించి యమునోత్రి బయలుదేరాము .
మేము ఉన్నది బార్కోట్ అనే ఊరి చివర ' Monkey's trail ' అనే రిసార్ట్ లో ఉన్నాము . ఆ పేరు విచిత్రంగా ఉంది అనుకున్నాము . కాని ఆ వెనక వున్న కొండలు కి అదే పేరుట .
ఇక ఈ యమునోత్రి ప్రయాణం -- ఇలాంటి ప్రయాణం చెయ్యాలంటే -౧. విపరీతమైన భక్తి ౨. లేదా బాగా ఫిసికల్ స్టామినా అన్నా ఉండాలి . శక్తి అంటే మాములుగా మనం జిం , నడక Where?Plain నేల మీద కాదు . మెట్లు ఎక్కడం దిగడం . ఇది మొత్తం ప్రాక్టీసే . నేను ఇంతకు కాలేజిలో వారానికి మూడు నాలుగు రోజులు వారానికి ఒక సారి కాని , ఒక్కో సారి రెండు సార్లు కాని మూడో అంతస్థుకు వెళ్ళేదాన్ని . అలా అలవాటుగా ఉన్నప్పుడు జాగేశ్వర్ వెళ్ళడానికి అంత కష్ట పడలేదు . నా రోజు వారినడక 10% శాతం పని చేసింది. పోని 25% శాతం .
యమునోత్రి బార్కోట్ నుంచి 43 కిలోమీటర్లు. వెళ్ళేటప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించలేదు . మన తిరుపతి కొండ పాత దారిలో అంతకంటే చాలా ఎక్కువ మలుపులుంటాయి . ఇక మంగూళురు బస్సులో వెడితే చుక్కలు కనిపిస్తాయి . 43 కిలోమీటర్లు తరువాత జానకి చట్టి అనే ఊరికి వెడతాము. వారికి ఇదే అంటే యాత్రికులే పెద్ద ఆదాయ సాధన .
అంత వరకు పరవాలేదు . అక్కడ నుంచి యమునోత్రి కి 6 కిలోమీటర్లు . ఆరే కదా అనుకోడానికి లేదు . అదో నిట్ట నిలువు కొండ. ఎత్తు. రెండు అడుగులు వేస్తేనే ఆయాసం వచ్చింది .
options -- గుర్రము , డోలి , నడక . పెద్ద ధీరురాలిలాగా నడుద్దామా అనుకున్నాను . మళ్ళీ ఎందుకో భయమేసింది . సరేలే డొలి ఎంచుకున్నాను . ఆ డోలి పైకి తీసుకుని వెళ్ళడానికి 8500/-. గుర్రం -౩౫౦౦/- . ఇదంతా వాతవరణాని బట్టి . వాన వచ్చిందో అదే 20000/- అయ్యి కూర్చుంటుంది .
డోలి ఎక్కడం - మానవులుగా మనస్సుని చంపుతుంది. పైగా వాళ్ళు ఆ కొండ ఎక్కడం. మధ్య మధ్య లో టీకి , టిఫిన్ కి ఆపుతారు . దానికి fixed rates . కొండ కింద 200/-, పైన 400/- .
వారి శ్రమ చూస్తే అది చాలా తక్కువ అనిపిస్తుంది . టీ కొట్టు దగ్గర ఆపినప్పుడు గమనించాను - బీడి చుట్ట విడదీసి మరో పొడి కూరుస్తున్నారు . తేలికగా అర్థం చేసుకోవచ్చు . అయితే ఎవరూ misbehave చెయ్య లేదు .టీ కి డబ్బులు ఇవ్వను అంటే ఎలా వుంటారో తెలియదు . కొందరు అలా దగ్గుతూనే వున్నారు . నేను అడిగాను - డాక్టర్ కి చూపించు కూడదా అని . ఇది అంత తగ్గేది కాదు అన్నాడు . తరువాత గమనించాను - అక్కడ డాక్టర్లు ఎవరంటే -- RMP లు . అంటే వైద్య సౌకర్యం తక్కువ అని
గుర్రాలు - నిజానికి అవి గుర్రాలు కాదు -- mules. గాడిద కి గుర్రనికి cross . అవి ఎక్కి వెళ్ళడం . అలవాటు లేకుండా ఎక్కితే - వెనక్కి వంగితే గుర్రానికి ఇబ్బంది , ముందుకు వంగితే మనకు ఇబ్బంది లాంటిది ( vice versa అవ్వచ్చు ) . నయం ఎక్కాను కాదు అనుకున్నాను . పుట్టి మరీ దారుణం . మనిషిని బుట్టలో ఎక్కించుకుని పైకి మోయడం ! అలానూ వెడుతున్నారు .
భక్తి కి ఏమి తక్కువ లేదు . అలా జనం వెడుతూనే వున్నారు . చిన్నా , పెద్దా , ఆడ , మగా -- చేతిలో కర్ర , ఆయస పడుతూ అలా ఎక్కుతూనే వున్నారు .
పైకి ఎక్కితే రెండు hot water springs . అందులో చిన్న దానిలో నాలుగు బియ్యం గింజలు మూటగట్టి ఆ నీళ్ళ లో ముంచితే సగం వుడుకుతున్నాయి . అదే ప్రసాదం . అందులోనే నాలుగు పప్పు గింజలు . నేను అవి తీసుకునే సాహసం చెయ్యలేదు . అక్కడ యమున నది నీరు, ఈ వేడి నీరు కలిపి ఒక్క చోట ఒక కుండలి లా చేసారు . అక్కడ అందరూ స్నానాలు . యమున నది విగ్రహం బాగుంది . గుడిలో కి వెళ్ళి దణ్ణం పెట్టుకుని బయటకు వచ్చాను . తరువాత అక్కడ హనుమాన్ గుడి . లోపలకి చెప్పులుతో కూడా వెళ్ళి పోతున్నారు . ఇవ్వాళంటే ఎండా . ఎప్పుడూ అలా ఉండదు కదా !
జనం , క్యూలూ మాములే .
మేము హోటల్ నుంచి కాస్త పూరి పాక్ చేసి తెచ్చుకున్నాము . అది తిని మళ్ళీ వెనక్కి . వెనక్కి 45 నిమిషాలలో తెచ్చి పడేసారు . ఒక పది కూడగానే బయలుదేరి వచ్చేసాము . అందులో మబ్బులు కమ్మాయి . దిగి స్నానం చేసి , టీ తాగేసరికి ఉరుములతో. మెరుపులతో వాన.
శివాలిక్ కొండలు ఎంతో అందంగా వుంటాయి . వెళ్తూ వుంటే దూరం నుంచి హిమాలయాలు కనపడుతున్నాయి . అదో రాజసం . అసలు ఈ కొండలే రాజసం గా వుంటాయి . పూర్వికులు పర్వత రాజులని ఊరికే అనలేదు .
యమున ప్రస్తుతం చిన్న ధారే . కాని అంత పై నుంచి వస్తోంది కదా ! కొండ పక్కన నిల్చుంటే లోపల నుంచి నది ప్రవహిస్తున్న చప్పుడు వినపడతుంది . చెట్లు , రక రకాల పూలు కనపడ్డాయి . పిట్టలు కనపడ్డాయి . ఏదీ -- ఈ డోలీ మోస్తున్న మనుష్యులను గమనిస్తూ వాటి పై దృష్టి పెట్టలేదు . అందుకే చిన్నప్పుడే వెళ్ళాలి .





No comments:
Post a Comment