యాత్ర స్పెషల్ -11
బదరీ నుండి మనా వెళ్ళాలని వుద్దేశం . కాని అప్పటికే సగం మంది అడ్డం పడ్డారు. మనా వెడితే వ్యాస గుహ, గణేశ్ గుహ , సరస్వతి నది మూలం చూడచ్చు. కాని నేను రానని చెప్పాను. చాలా మంది నాతో బాటు రామనేసారు. అప్పటికే అక్కడ weather forecast వర్షం అని వుందని స్వామిజీ ప్రోగ్రాం కాన్సిల్ చేసారు. అందుకని తీరికగా తరువాత ప్రయాణం కి బయలు దేరాం. తరవాత హాల్ట్ రుద్ర ప్రయాగ.
ఎక్కడక్కడైతే రెండు నదులు కలిస్తే అక్కడ ప్రయాగ అంటారు. గంగ కున్న ఉపనదులు వల్ల 5 ప్రయాగలు.మేము రుద్ర ప్రయాగ కి బయలు దేరాము . అక్కడ అలకానంద మరియు మందాకిని కలియక. ముందు విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద , దౌళి గంగ కలిసిన చోటు ఆగి చూసాము .
పాండవ వనవాసం లో భీముడు ద్రౌపది అడిగిందని పుష్పాల కోసం వెడుతూ దారిలో ముసలి కోతి అని హనుమంతుడి తోక తీయబోయి భంగ పడ్డ కధ గుర్తుంది గదా ?! ఆ కధ జరిగింది ఇక్కడే అని హనుమాన్ చట్టి ( ఇక్కడ హనుమాన్ చట్టిలు చాలా వున్నాయి) అని ఒక చిన్న గుడి దారి మధ్యలో వుంది. దిగి దణ్ణం పెట్టుకున్నాం. అది నిజమా కాదా అని కాదు. మన వాళ్ళు ఈ కధలతో కళ్ళకి కనిపించని దారంతో దేశాన్ని కట్టి పడేసారు.
మేము సాయంకాలానికి రుద్ర ప్రయాగ చేరాము. మేము దిగిన హోటల్ చాలా బాగుంది Monal. గంగ వొడ్డు . కావాలంటే దిగి గంగ వొడ్డున కూర్చోవచ్చు. మేము దిగ లేదనుకొండి. మారూం బాల్కనీ నుండి కనపడుతుంది. మాదసలు గ్రౌండ్ . పై న వారికి ఇంకా బాగా కనపడుతుంది .
కొంతమంది పొద్దున్నే లేచి దేవ ప్రయాగ్ కి స్నానానికి వెళ్ళారు. కొంతమందిమి మా వల్ల కాదని వుండి పోయాము. అక్కడ అలకనంద, భాగీరథి కలిసి గంగా నదిగా అవుతాయి. అప్పటికే మా లో కొందరికి తుమ్ములు దగ్గులు మొదలయ్యాయి. అదీ లెక్క చేయకుండా వెళ్ళి స్నానం చేసేంత భక్తి వున్న వారున్నారు . అప్పటి దాకా జాగ్రత్తగా కాపాడుకొస్తున్న ఆరోగ్యంకి test పెట్టదల్చుకో లేదు .





No comments:
Post a Comment