యాత్ర స్పెషల్ -7
గుప్త కాశీ ప్రయాణం లో పెద్ద విశేషాలు లేవు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేరాము . దారిలో టెహ్రి డామ్ చూసాము. ప్రభుత్వ భక్తులు వావ్ వూఁఁఁ అన్నారు కాని అదొక పర్యావరణ దుశ్చర్య అని అర్ధమవుతుంది. నిపుణులు చాలా గట్టిగా వద్దని చెప్పినా రాజకీయ అవసరాలు వాటిని తోసి పుచ్చాయి .
ఆ రిజర్వాయర్ మథ్య లో వాళ్ళ అధికారులు కోసం ఓ పది రూమ్ లు కట్టుకున్నారు . వడ్డించే వాళ్ళు మన వాళ్ళయితే !!
మాది The village resort. ఈ కొండ ప్రాంతంలో పూలు భలే పెద్దవిగా విరగబూస్తున్నాయి . హాయిగా తిని పడుకున్నాం. పొద్దు న్నే నాలిగింటికి లేచి పెద్ద ప్రయాణానికి తయారవ్వాలి.





No comments:
Post a Comment